Tuesday, April 30, 2024

వేపచెట్టుకు చాకలి ఐలమ్మ విగ్రహం.. అవమానించారని నిరసన..

తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల జాగీర్దార్ల తో భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పట్టువదలని యోధురాలు చాకలి ఐలమ్మ అలాంటి యోధురాలు నడయాడిన ఇలాకా లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రజకుల ఆత్మగౌరవాన్ని అవమాన పరిచేలా అధికారులు ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని జనగామ జిల్లా రజక సంఘం అధ్యక్షులు సాంబరాజు రవి పేర్కొన్నారు బుధవారం జనగామ మండలంచీటకోడూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నల్లజెండాలతో రజకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ జనగామ జిల్లాలో పాలకుర్తి మండల కేంద్రంలోని పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అధికారులు ప్రజా ప్రతినిధులు రాత్రికి రాత్రే తొలగించి భద్ర పరచవలసిన చోట భద్ర పరచకుండా నిర్లక్ష్యంగా రజకులను అవమాన పరిచేలా వేప చెట్టుకు యోధురాలు విగ్రహాన్ని కట్టివేయడం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాకాలో రజకులకు ఇలాంటి అవమానం జరగడం జీర్ణించుకోలేకపోతున్నామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రజకులకు పోరాటయోధులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ధ్వజ మెత్తారు ఇప్పటికైనా జిల్లా మంత్రివర్యులు అధికారులు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని యథాస్థానంలో నెలకొల్పాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆయన పేర్కొన్నారు ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు ముఖ్య సలహాదారులు రమేష్ తదితరులు పాల్గొన్నారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement