Thursday, May 2, 2024

Central Team Visit – కుంగిన ల‌క్ష్మీ బ్యారేజ్ ను ప‌రిశీలించిన కేంద్ర బృందం…

భూపాలపల్లి: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ కుంగిన నేపథ్యంలో అక్కడ కేంద్ర బృందం పరిశీలించింది. వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. మంగళవారం బ్యారేజ్‌ను పరిశీలించింది. వంతెన కుంగిన ప్రాంతాన్ని, పగుళ్లు ఏర్పడిన ప్రదేశాన్ని కేంద్ర బృందం సభ్యులు ప్రత్యక్షంగా పరిశీలించారు.

20వ పిల్లర్ వద్ద నిచ్చెన సాయంతో కిందకు దిగి దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. శనివారం రాత్రి ఏం జరిగిందన్నది ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత బ్యారేజీ నుంచి కేంద్ర బృందం సభ్యులు వెనుదిరిగారు. ఒకటి.. రెండు రోజుల్లో కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందజేయనున్నట్టు సమాచారం. కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement