Monday, October 14, 2024

Amrit Kalash Yatra : రైలు ప్రారంభం..ఆ రైలు ప్ర‌త్య‌క‌మేంటి

అమృత్‌ కలాష్‌ యాత్ర రైలును భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఈ రైలు ఒడిశా నుంచి న్యూ ఢిల్లీ వెళ్లనుంది. ఒడిశా నుంచే కాకుండా దేశంలోని పలు ప్రధాన నగరాల నుంచి కూడా ఈ ప్రత్యేక రైళ్లను ఢిల్లీకి నడిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో వీరులకు నివాళులర్పిస్తూ, వ్యారి త్యాగాలను స్మరించుకుంటూ.. దేశ రాజధాని న్యూఢిల్లీలో స్మారక శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆగస్టు 9వ తేదీన నా భూమి, నా దేశం కార్యక్రామినికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు.. దేశంలోని మారుమూల గ్రామాలు, పట్టణాల నుంచి పవిత్ర మట్టి, బియ్యంను ఢిల్లీకి 30వ తేదీలోపు తరలించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement