Tuesday, May 7, 2024

CBSE 10th ఫలితాలు రేపు విడుదల.. ఆన్‌లైన్‌లో ఎలా తెలుసుకోవచ్చు!!

CBSE 10th ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను cbse.gov.inలో ఆన్‌లైన్‌లో, డిజిలాకర్‌లో అలాగే ఆఫ్‌లైన్‌లో SMS ద్వారా కూడా చెక్​ చేసుకునే వెసులుబాటు ఉంది. 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించిన వ్యాల్యూయేషన్​ పూర్తయ్యింది.

cbse.gov.in లేదా cbseresults.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్​ చేయాలి.
హోమ్‌పేజీలో 10వ తరగతికి సంబంధించిన CBSE టర్మ్ 2 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి
మీ రోల్ నంబర్, పాఠశాల కోడ్, పుట్టిన తేదీని ఎంటర్​ చేయాలి
CBSE 10వ తరగతి ఫలితం 2022 స్క్రీన్‌పై చూపిస్తుంది.
ఫ్యూచర్​ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోవచ్చు.
10వ తరగతి టర్మ్ 2కి సంబంధించిన ఫలితాలు కూడా సులభంగా యాక్సెస్ చేయడానికి Digilocker.gov.inలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని విద్యార్థులు గమనించాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement