Friday, May 3, 2024

కాల్​ సెంటర్​ స్కామ్​, నిందితుల అరెస్టు.. 9 మందిని అరెస్టు చేసిన సైబరాబాద్​ పోలీసులు

జార్ఖండ్‌లో తెలుగు మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకొని కాల్‌ సెంటర్‌ రాకెట్‌ను నడుపుతున్న ఓ బృందాన్ని తెలంగాణ పోలీసులు ఛేదించారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో శుక్రవారం తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేయడంతో పోలీసులు ఈ మోసాన్ని బట్టబయలు చేశారు. అరెస్టయిన వారిని ఆటోరిక్షా డ్రైవర్లు కాట్రావత్‌, రాజు, కె.సంతోష్‌, డి.శ్రీనివాసులుగా గుర్తించారు. విద్యార్థులు ఇ.గణేష్‌, ఎం.వెంకటేశ్‌, కె.హరిలాల్‌, కె.గణేష్‌, ఎం.గణేష్‌, రైతు కె.రాజు అని పోలీసు అధికారులు తెలిపారు. జార్ఖండ్‌కు చెందిన విక్రమ్‌ ఠాకూర్‌తో కట్రావత్‌ స్నేహం పెంచుకున్నాడు. అతను హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా ఈ ఆటోరిక్షా వాలాతో క్లోజ్‌గా మూవ్‌ అయ్యేవాడు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజలకు రుణాలు.. ఇతర సేవలను అందిస్తున్నారనే నెపంతో తన సైబర్‌ ఫ్రాడ్‌ కార్యకలాపాలకు తెలుగు వ్యక్తులను ఎంచుకోవడంలో విక్రంతో కట్రావత్‌ చేతులు కలిపాడు. తన కప
సహకరింనందుకు 30శాతం కమీషన్‌ మాట్లాడుకున్నాడు. కట్రావత్ తన బావమరిది సంతోష్‌తో కలిసి తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని పెద్దమందడ్ గ్రామం నుంచి తెలుగు మాట్లాడే వ్యక్తులను తీసుకువెళ్లి ఈ స్కామ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. జనవరి 2021లో మొత్తం తొమ్మిది మంది నిందితులు ధన్ బాద్‌కు వెళ్లారు. అక్కడ విక్రమ్‌ ఠాకూర్‌ వారికి ఫిషింగ్‌ లాంటి ఆన్‌లైన్‌ మోస పూరిత కార్యకలాపాలలో వాడుకున్నాడు. వారికి వసతి కల్పించి శిక్షణను కూడా అందించాడు. విక్రమ్‌ ఠాకూర్‌ పలు సిమ్‌కార్డులు సేకరించడమే కాకుండా కల్పిత పేర్లతో బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు. ఈ కాల్‌ సెంటర్‌ స్కామ్‌ను ఛేదించి వీరి మోసాన్ని అరికట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement