Monday, May 6, 2024

మండుతున్న ఇంధనం, మార్చి 22 నుంచి బాదుడే.. 13 రోజుల్లో 11 సార్లు పెంపు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావం కారణంగా.. దేశీయంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కొన్ని రోజుల పాటు విరామం ఇచ్చిన ఇంధన సంస్థలు, మార్చి 22 నుంచి పెరుగుతూనే వస్తున్నాయి. పెట్రోల్‌, డీజెల్‌ ధరలు మళ్లిd పెరిగాయి. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్‌ కంపెనీలు 3వ తేదీ ఆదివారం పెట్రోల్‌, డీజెల్‌ ధరలను విడుదల చేశాయి. ఆదివారం రాజధాని ఢిల్లిdలో పెట్రోల్‌, డీజెల్‌ ధరలు లీటర్‌కు 80పైసలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర 84పైసలు, డీజెల్‌పై 85 పైసలు పెరిగింది. ఇంధన ధరల తాజా పెరుగుదల తరువాత.. ఢిల్లిdలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103.41కు చేరుకోగా.. డీజెల్‌ లీటర్‌ ధర రూ.94.67కు చేరుకుంది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.118.41కు చేరుకోగా.. డీజెల్‌ ధర 102.64కు చేరుకుంది. గత 13 రోజుల్లో 11వ సారి చమురు పెట్రోల్‌, డీజెల్‌ ధరలు పెరిగాయి.

చివరిసారిగా.. 2021 నవంబర్ 4న..

2021, నవంబర్‌ 4 నుంచి చమురు ధరలు దేశ వ్యాప్తంగా స్థిరీకరించారు. దాదాపు ఒకటిన్నర నెలల తరువాత అంటే.. మార్చి 22వ తేదీన తొలిసారి ఆయిల్‌ కంపెనీలు ధరల పెంచాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 3 వరకు 13 రోజుల్లో 11 సార్లు చమురు ధరలు పెరిగాయి. గత 13 రోజుల్లో ఢిల్లిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.8 పెరిగింది. 2022, మార్చి 21 వరకు ఢిల్లిలో ఒక లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.41 ఉండగా.. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.103.41కు చేరుకుంది. చెన్నైలో పెట్రోల్‌, డీజెల్‌ ధరలు లీటర్‌కు 75 పైసలు చొప్పున ఆదివారం పెరిగాయి. చెన్నైలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.108.96, డీజెల్‌ లీటర్‌కు రూ.99.04కు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు మండిపోతున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.117.13గా ఉంది. ఇదే సమయంలో లీటర్‌ డీజెల్‌ ధర రూ.103.20గా ఉంది. కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.117.31గా ఉంది. లీటర్‌ డీజెల్‌ ధర రూ.103.41గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్‌ లీటర్‌ రూ.117.63 ఉండగా.. డీజెల్‌ ధర రూ.103.70గా ఉంది. మెదక్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.117.13 ఉండగా.. డీజెల్‌ ధర రూ.103.66గా ఉంది.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.118.15కు లభిస్తుండగా.. లీటర్‌ డీజెల్‌ ధర రూ.105.50గా ఉంది. విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.117.62గా ఉండగా.. డీజెల్‌ ధర రూ.104.06గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.117.22గా ఉండగా.. డీజెల్‌ ధర రూ.104.70గా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement