Saturday, December 7, 2024

Breaking : గుడివాడ ఏమైనా పాకిస్థానా – చంద్ర‌బాబు జోలికి వ‌స్తే ఊరుకోం – బుద్దా వెంక‌న్న వార్నింగ్

మంత్రి కొడాలి నాని చ‌రిత్ర గుడివాడ అంతా తెలుస‌ని టిడిపినేత బుద్ధా వెంక‌న్న మండిప‌డ్డారు. కొడాలినానికి ఆయ‌న భాష‌లో చెబితేనే అర్థం అవుతుంద‌న్నారు. నానిది దొంగ‌త‌నాలు చేసే బ‌తుక‌ని ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు…కొడాలికి మ‌దం,డ‌బ్బు,ప‌ద‌వి పిచ్చి ప‌ట్టింద‌న్నారు. కొడాలి నాని మ‌నిషి కాదు మృగం అని మండిప‌డ్డారు. ప‌థ‌కం ప్ర‌కారం టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడుని తిడుతున్నారు. చంద్ర‌బాబు గురించి మాట్లాడే అర్హ‌త ఉందా అని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు అంటే ఒక బ్రాండ్ అన్నారు. తాను కొబ్బ‌రికాయ‌ల వ్యాపారం చేసింది నిజ‌మేన‌న్నారు. మాట్లాడితే లోకేష్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావ్ అని నిల‌దీశారు. కొడాలిని మంత్రి వ‌ర్గం నుంచి డిస్మిస్ చేయాల‌ని డిమాండ్ చేశారు. గుడివాడ ఏమైనా పాకిస్థానా అన్నారు. గుడివాడ‌కు ఎవ‌రూ వెళ్ల‌కూడ‌దా అని నిల‌దీశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement