Friday, April 26, 2024

Braking : హాస్ట‌ల్ పై నుండి ప‌డి యువ‌తి మృతి-ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు

లేడీస్ హాస్టల్ పై నుండి ప్రమాదవశాత్తు జారీ పడి రేవతి అనే యువతీ మృతి చెందింది. ఆమె వ‌య‌సు 25సంవ‌త్స‌రాలు. ఈ సంఘ‌ట‌న గుంటూరు అరండ‌ల్ పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిథిలో చోటు చేసుకుంది. యువతీ మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.అరండల్ పేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.కనీసం భద్రత చర్యలు లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్నార‌ని స‌మాచారం. దాదాపు 20 గదులలో 100మందికి పైగా విద్యార్థులు హాస్టల్ లో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement