Bomb threat | ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రుల‌కు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఢిల్లీలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాంబులున్నట్లు పోలీసులకు మెయిల్స్ వచ్చాయి. బురారీ ప్రభుత్వాసుపత్రిలో, మంగోల్‌పురిలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో బాంబులు పెట్టినట్లు కొందరు ఆగంత‌కులు మెయిల్స్ ద్వారా హెచ్చరించారు. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ వెంటనే విమానాశ్రయానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. దాంతో బాంబు బెదిరింపులు వచ్చిన ఆసుపత్రులకు కొన్ని బృందాలు చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నాయి.

Exit mobile version