Friday, May 3, 2024

బాలీవుడ్ నటుడు బ్రహ్మ మిశ్రా కన్నుమూత

ముంబై-ప్రఖ్యాత మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో లలిత్ పాత్రలో నటించిన బ్రహ్మ మిశ్రా కన్నుమూశారు. మహానగరంలోని ఎన్ లక్స్ నగర్ సొసైటీలోని సొంత ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఇంటినుంచి దుర్వాసన వస్తూండటంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మిశ్రా మరణవార్తను మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో మున్నాభాయ్ పాత్రలో నటిస్తున్న దివ్యేందు ధ్రువీకరించారు. నాలుగు రోజుల క్రితం ఛాతీ నొప్పితో బాధపడిన మిశ్రా వైద్యులను సంప్రదించారు. చికిత్స అనంతరం ఇంటికి చేరారు. కాగా బుధవారం ఇంటినుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాత్ రూమ్ లో మిశ్రా మృతదేహం లభ్యమైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement