Friday, March 1, 2024

Fire Accident – బాణ‌సంచా కేంద్రాల‌లో పేలుళ్లు .. 10మందికి పైగా స‌జీవ ద‌హ‌నం..

విరుధునగర్‌: తమిళనాడులోని విరుద్‌నగర్‌ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రెండు వేర్వేరు చోట్ల బాణసంచా కేంద్రాల్లో జరిగిన పేలుళ్ల ఘటనలో 10 మందికి పైగా స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు.. 10కి పైగా గాయ‌ప‌డ్డారు. ముందుగా రంగపాళ్యంలోని ఓ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 9మృతిచెందగా.. కమ్మపట్టి గ్రామంలో ఒకరు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సేవల సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసేందుకు సంయుక్త ఆపరేషన్ చేపట్టారని పోలీసులు తెలిపారు. శివకాశికి సమీపంలోని బాణసంచా కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో స‌జీవ‌ద‌హ‌న‌మైన‌ 9 మృతదేహాలు గుర్తించినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మృతులంతా అక్కడే పనిచేసే కార్మికులు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement