Sunday, March 24, 2024

Follow up | మార్కెట్లకు బ్లాక్‌ మండే.. ఎస్‌వీబీ ఎఫెక్ట్‌తో భారీ క్రాష్‌

స్టాక్‌ మార్కెట్లు సోమవారం నాడు భారీ నష్టాల్లో ముగిశాయి. వరసగా మూడో సెషన్‌లోనూ సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ ఉదయం సూచీలు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. కొద్ది సేపటికే సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్‌ ఏకంగా 1200 పాయింట్లు నష్టపోయింది. అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం, సిగ్నేచర్‌ బ్యాంక్‌ మూసివేత ప్రభావం మన మార్కెట్లపై పడింది. ఈ సంక్షోభం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆందోళనతో మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతిన్నది.

ఒక్క రోజులో 4.43 లక్షల కోట్ల నష్టం..

సోమవారం నాడు స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు 4.43 లక్షల కోట్లు నష్టపోయారు. మార్కెట్లు ముగిసే సమాయానికి బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం విలువ 2,58,56,295.60 కోట్లుగా ఉంది. అంతకు ముందు ముగింపు విలువతో పోల్చితే ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే కంపెనీల విలువ 4,43,023.89 కోట్లు అవిరైంది. సోమవారం నాడు బీఎస్‌ఈలో 3,757 స్టాక్స్‌ ట్రేడింగ్‌ అయ్యాయి. వీటిలో 2,915 షేర్లు నష్టపోయాయి. 695 షేర్లు లాభపడ్డాయి.

సెన్సెక్స్‌ 897.28 పాయింట్ల నష్టంతో 58237.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 258.60 పాయింట్ల నష్టంతో 17154.30 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 1056 రూపాయలు పెరిగి 57206 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 2655 రూపాయలు పెరిగి 65545 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.99 రూపాయలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు

టెక్‌ మహీంద్రా, అపోలో ఆస్పటల్స్‌ షేర్లు మాత్రమే లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌ఈఐ, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ పెయిం ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌ అండ్‌ టీ, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, విప్రో, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, సన్‌ ఫార్మా, జేఎస్‌డబ్యూ స్టీల్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, దివిస్‌ ల్యాబ్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement