Monday, April 29, 2024

బడ్జెట్ అంతా పరనింద, ఆత్మస్తుతి.. ఎద్దేవా చేసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ అంతా పరనింద, ఆత్మస్తుతి అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. సోమవారం సాయంత్రం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ అని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలను కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిట్టడానికి, విమర్శించడానికి మాత్రమే ఏర్పాటు చేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏనుగు తొండంలా బడ్జెట్ చూపించి ఎలుక తోకలాగా నిధులు విడుదల చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.

బడ్జెట్ అంకెలను భారీగా పెంచి ప్రజలను భ్రమల్లోకి నెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమం,అభివృద్ధికి సరైన సమతుల్యత లేకుండా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని చెప్పారు. పాత సీసాలో కొత్త సారా మాదిరిగా దళిత బంధుకు నిధులు కేటాయించారని ఆయన చెప్పారు. గత తొమ్మిదేళ్లుగా విద్య, వైద్య రంగాలలో తెలంగాణ పూర్తిగా నిర్వీరమైందని లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎంతో మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా బడ్జెట్‌లో వారి ఊసే లేదని ఆరోపించారు.

- Advertisement -

2022లో తెలంగాణలో వెంది మంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైతు స్వరాజ్ వేదిక గణాంకాలు చెబుతున్నాయన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు దేశవ్యాప్తంగా అబ్ కీ బార్ పరివార్ సర్కార్ రావాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆయన ఆరోపించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మీ కుటుంబం అన్నప్పుడు కేవలం మీ నలుగురే ఎందుకు మంత్రులవుతున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement