Thursday, October 31, 2024

Mamata Banerjee: మ‌మ‌త‌ను చెంప‌దెబ్బ‌లు కొట్టండి.. బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని విద్యావ్యవస్థ గురించి మాట్లాడుతూ.. సీఎంను చెంపదెబ్బలు కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మథురాపూర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో మజుందార్ మాట్లాడుతూ.. చదువుల్లో మన పిల్లలు రాణించకపోవడం వారి తప్పు కాదని, తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడానికి బదులు మమత చెంపలు పగలగొట్టాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

మమత విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని మజుందార్ దుయ్యబట్టారు. మజుందార్ వ్యాఖ్యలపై టీఎంసీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. భౌతికదాడులను ఆయన ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజుందార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు సిగ్గుచేటని టీఎంసీ నేత మహువా మెయిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుకాంత వ్యాఖ్యలకు నిరసనగా టీఎంసీ మహిళా విభాగం నేడు ర్యాలీ నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement