Thursday, June 1, 2023

Big Breaking : అనుమానాస్ప‌ద స్థితిలో చేర్యాల జ‌డ్పీటీసీ మృతి.. దుండ‌గుల దాడే కార‌ణ‌మా?

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల జెడ్పీటీసీ శెట్టే మల్లేశం ఉదయం వాకింగ్ వెళ్లిన చోట రోడ్డు పక్కన పడివున్నాడు. గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేశారా..? ఏదైనా వాహనం డీ కొట్టిందా..? అనేది ఇంకా తెలియ‌రాలేదు. తలకు తీవ్ర గాయాలు కావ‌డంతో అపస్మారక స్థితిలో ఉన్న మల్లేశంను సిద్దిపేట ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌థ‌మ చికిత్స అనంత‌రం మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు హైదరాబాద్ త‌ర‌లించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెల‌ప‌గా.. హైద‌రాబాద్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement