Sunday, October 6, 2024

Editorial : బైడెన్‌-జిన్‌పింగ్ భేటీ మొక్కుబ‌డేనా!

నిజానికి అదొక సంచలనమే! ప్రపంచానికి ఒక శుభ వార్తే! అగ్రరాజ్యాధిపతి జో బైడెన్‌, అదే హోదా కోసం తపిస్తున్న చైనా సర్వాధిపతి జిన్‌పింగ్‌ ముఖాముఖి కలవడం. అందునా ఏకబిగిన నాలుగు గంటల పాటు ఎదురెదురుగా కూచుని సంభాషించడం. వ్యక్తిగత మర్యాదలే కాకుండా ద్వైపాక్షిక అంశాలు, అగ్రరా జ్యాధీ శులు కాబట్టి ప్రాపంచిక విషయాలు మాట్లాడటం అంటే మరి అది సంచలనం కాదా! ప్రపంచానికే శుభవార్త కాదా! నాలుగు రోజుల క్రితం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఎపెక్‌ శిఖరాగ్ర సదస్సు కోసం ఇద్దరూ వెళ్లి నప్పుడు ఈ భేటీ జరిగింది.

సరిగ్గా ఏడాది తర్వాత ఈ ఇద్దరు నేతలు కలిశారు. తీరా ఏం జరిగింది? అంతటి సుదీర్ఘ సమావేశం అంటే తప్పనిసరిగా కొన్ని అంశాల్లో అయినా సానుకూల త సాధించి ఉండాలి. కాని ఆ భేటీ అలా ముగిసిందో లేదో ఇవతలకి వచ్చాక కొద్ది నిమిషాల్లోనే అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదం కావడమే కాకుండా ఆ సమావేశపు తీవ్రతని డొల్ల చేసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నియంత అని ఆయన చేసిన వ్యాఖ్య సందర్బ éశుద్ధి లేనిది. ఎనభై ఏళ్ల జో బైడెన్‌ వయస్సుతో వచ్చిన వాచాలత్వంతో చేశారని సరిపెట్టుకోలేని సందర్భమది. ఆ వ్యాఖ్యలకు చైనా సహజంగానే నొచ్చు కుంది. కీలక మంత్రి స్పందించడం ద్వారా అందులోని తీవ్రత ప్రపం చానికి అర్థమైంది. జిన్‌పింగ్‌ పక్కన ఉండగానే మీడి యా సమావేశంలో అలవోకగా అనేసిన జో బైడెన్‌ ఆ తర్వాత తనని తాను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఈ వైఖరి జిన్‌పింగ్‌కు ఎలాంటి సందేశం ఇచ్చి ఉంటుంది? గంట భేటీ బూ డిదలో పోసిన పన్నీరే అవుతుందా అన్న సందేహాలు ఆ క్షణానే మొదలయ్యా యి. అసలే అంతంత మాత్రం గా ఉన్న సంబంధాలు కొంతలో కొంతయినా ఈ భేటీతో మెరుగుపడతాయని భావించిన వారి ఆశల మీద జో బైడెన్‌ స్వయంగా నీళ్లు చల్లినట్టయింది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితిని చూశాం. అమెరికా తన సహజ ధోరణిలో చైనా మీద కూడా ఆంక్షలు విధించడాన్నీ చూశాం. రాజకీ య, ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక రంగాల్లో ఉభయ దేశాల మధ్య నెలకొన్న విభేదాలు అంతాఇంతా కాదు. ఈ భేటీ ద్వారా ఏదో ఘనకార్యం సాధిస్తారని ప్రపంచం ఊహించలేదు గాని కేవలం మెరమెచ్చపు మాటలతో సరిపెట్టకుండా కొంతలో కొంతయినా విధానపరమైన బాటలో నిర్మాణాత్మక చర్చలు సాగే అవకా శాలుంటాయ ని ఆశించిన మాట నిజం. చైనా తనదైన శైలిలో ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో దూకుడుగా వెళు తుండటం అమెరికాకు నచ్చడం లేదు. పశ్చిమ పసిఫిక్‌ లో కూటమి రాజకీయాలను అమెరికా అందుకే ప్రోత్స హించడమే కాకుండా తానే నాయకత్వ పాత్ర పోషిస్తున్న ది. చైనాకు ఏమాత్రం రుచించని రీతిలో తైవాన్‌కు ఆయుధ సాయం చేస్తున్నది. అలాగే చైనా కూడా తైవాన్‌ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచనలో లేదు. ముఖ్యంగా తన దేశ సార్వభౌమత్వం విషయంలో అస్సలు రాజీ పడదు. ఒక్క తైవాన్‌ విషయమే కాదు. దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్రాల విషయంలోనూ అంతే. అనేకా నేక దేశాలను తన రాజకీయ, ఆర్థిక వలయంలోకి తెచ్చు కునే వ్యూహంతో మొదలుపెట్టిన బెల్ట్‌ రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేసే అవకాశమూ లేదు. ఇంకా చెప్పాలంటే అమెరికాకన్నా దీటుగా ముందు వరసలో ఉండేందుకు ప్రపంచంలోని అనేక మూలలకు విస్తరించాలన్న యోచ నలో చైనా ఉంది. తన నావికా విస్తరణ వేగాన్ని తగ్గించు కోవడానికి సైతం చైనా ఇష్టపడటం లేదు. ఇంతటి సంక్లిష్ట తల మధ్య ముఖాముఖి చర్చలకు కుదిరిన ముహూర్తా న్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇరువురు నేతల మీద ఉంది. సమావేశం అనంతరం చేసిన సంయుక్త ప్రకటనలో సానుకూల చర్చలు జరిగాయని మొక్కుబడి పదాలు వాడారు తప్ప ఏయే అంశాల మీద నిర్మాణాత్మక చర్చలు జరిగాయి.. ఏయే అంశాల మీద విభేదాలు అలానే ఉన్నాయి అన్న విషయం మీద స్పష్టత లేదు. అయితే చాలా పరిణామాల తర్వాత ఇది తొలి భేటీ కాబట్టి అన్ని అంశాలు బహిర్గతం కావాలని ఆశించడం దౌత్య మర్యాద కూడా కాబోదు. కాకపోతే గుడ్డిలో మెల్ల అన్నట్టు కొంత సానుకూలత కూడా లేకపోలేదు. చైనాతో మిలటరీ స్పర్థల మీద ఉన్నతస్థాయిలో ముఖాముఖి మాటామంతీ ద్వారా పరిష్కరించుకునే విషయంలో ఉభయులూ అంగీకరించడం ఒక మంచి పరిణామం. సైనిక కమాండర్ల మధ్య టెలిఫోన్‌ సంబంధాలను పునరు ద్ధరిస్తారు. అక్రమ మాదకద్రవ్య రవాణా, కృత్రిమ మేధ స్సుతో వస్తున్న సమస్యల మీద ఎప్పటికప్పుడు పరస్ప రం చర్చించుకుంటూ సహకరించుకుంటూ పరిష్కరిం చుకోవాలని నిర్ణయించారు. అమెరికాతో భాగస్వామిగా ఉండటానికి, స్నేహితునిగా ఉండటానికి చైనా సుముఖం గా ఉందని జిన్‌పింగ్‌ జో బైడెన్‌తో చెప్పడం ద్వారా చైనా ప్రస్తుతానికి ఒక మెట్టు దిగే ఆలో చనలో ఉందని అర్థమ వుతున్నది. అమెరికాతో శతృత్వం పెంచుకోవడం తమ దేశ ప్రగతికి ప్రతిబంధకంగా మారుతున్నదని జిన్‌పింగ్‌ అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్టు ఆయన వైఖరిని బట్టి తేటతెల్లమవుతున్నది. అయితే చైనా తాజాగా ప్రదర్శించిన ఈ వైఖరికే జిన్‌పింగ్‌ కట్టుబడి ఉంటారా అంటే నమ్మకంగా చెప్పడం కష్టం. గత అనుభవాలు, సంఘటనలను బట్టి జిన్‌పింగ్‌ చైనా కమ్యూనిస్టు ప్రభు త్వ నియంతగానే వ్యవహరిస్తారు. ప్రజాస్వామ్య నేతల ఆలోచనలకు నియంతల ఆలోచనలు తూర్పు పడమర లు మాదిరిగా ఉంటాయి. జో బైడెన్‌ చివర్లో అన్నది కూడా ఇదే ఉద్దేశంతో. అమెరికాకు భిన్నమైన వ్యవస్థð చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంలో ఉంటుందని బైడెన్‌ వ్యాఖ్యా నించడం ద్వారా జిన్‌పింగ్‌తో దౌత్యపరమైన వ్యవహార శైలి విషయంలో ఎప్పటికప్పుడు జాగరూకతతో ఉండాలన్న స్వీయ హెచ్చరికను తనకు తాను చేసుకున్న ట్టు అనిపిస్తుంది. మొత్తంమీద జోబైడెన్‌-జిన్‌పింగ్‌ అరుదైన భేటీ అంతిమ ఫలితం గురించి చెప్పాలంటే.. వడ్లగింజలో బియ్యపు గింజ..బియ్యపుగింజలో వడ్లగింజ!

Advertisement

తాజా వార్తలు

Advertisement