Friday, April 19, 2024

భోగి అంటే కొత్త ఆలోచనలకు నాంది : ఎమ్మెల్సీ కవిత

పాత ఆలోచనలు భోగి మంటల్లో వేసి.. కొత్త ఆలోచనలకు నాంది పలకడం ఈ పండుగ ఉద్దేశమని, మనలోని ప్రతికూలతలను విడిచిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్దామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను అందరం ఘనంగా జరుపుకుంటామని… హైదరాబాద్‌లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి నుంచి భారత్‌ జాగృతిగా రూపాంతరం చెందాక మొదటి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పల్లెవాతావరణాన్ని నగరానికి తీసుకొచ్చిన హైదరాబాద్‌ జాగృతివారిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement