Thursday, May 2, 2024

విచిత్రం.. టీకా ఉత్పత్తి కంపెనీలో 50 కరోనా పాజిటివ్ కేసులు

కరోనాకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలనూ కరోనా వదిలిపెట్టడం లేదు. వినడానికి విచిత్రంగా ఉన్నా కానీ ఇది నిజమే. దేశానికి వ్యాక్సిన్ అందిస్తున్న హైద‌రాబాద్‌లోని భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన 50మంది ఉద్యోగులు కరోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ సుచిత్రా ఎల్లా ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. అయితే ఆమె ట్వీట్ కాస్తా వైర‌ల్‌గా మారింది. అంద‌రికీ వ్యాక్సిన్ వేసుకోమ‌ని చెబుతున్న మీరు.. మీ ఉద్యోగులకు ఎందుకు వేయ‌లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు కూడా స్పందిస్తూ.. చాలా రాష్ట్రాల్లో టీకా సరఫరాలో అవాంత‌రాలు వ‌స్తున్నాయని ట్వీట్ చేశారు.

వీటిపై సుచిత్రా ఎల్లా స్పందించారు. త‌మకు ఫిర్యాదులు వ‌స్తున్నాయని, 50మంది ఉద్యోగులు కరోనా బారిన ప‌డ్డ‌ప్ప‌టికీ తాము మాత్రం లాక్‌డౌన్‌లో కూడా 24గంట‌లు ప‌నిచేస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. త‌మ సంస్థ 18 రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ స‌ప్లై చేస్తోంద‌ని, ఇంకా చేస్తూనే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఆమె ట్వీట్‌పై ప‌లువురు నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. కొంద‌రు థాంక్యూ చెబుతుంటే మ‌రి కొంద‌రు సందేహాల‌ను అడుగుతున్నారు. టీకా వేసుకున్న‌ప్ప‌టికీ కొవిడ్ పాజిటివ్‌గా వ‌స్తోంద‌ని, అస‌లు టీకా ప‌నిచేస్తుందా అంటూ మ‌రికొంద‌రు ఇలా రీ ట్వీట్ల‌తో ఎల్లా ట్వీట్‌ను వైర‌ల్‌గా మారుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement