Friday, April 26, 2024

బెస్ట్​ డీల్​.. అత్యధికంగా సేల్​ అయిన ఐపోన్​ 13 భారీ ఆఫర్​

ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్లలో ఐఫోన్ 13 నిలిచింది. ఫ్లిప్‌కార్ట్‌ ‘బెస్ట్ సెల్లర్’ లిస్ట్‌లో ఐఫోన్‌ 13 చోటు సంపాదించింది. ఈ ఐఫోన్ మోడల్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న.. డబ్బుకు అత్యంత విలువైన ఆప్షన్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ ప్రొడక్టులకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. చాలా మంది యాపిల్‌ నుంచి లేటెస్ట్ ప్రొడక్టు రిలీజ్‌ అయిన వెంటనే కొనాలని చూస్తుంటారు. ఇంకొందరు ఎక్కువ ధర కారణంగా వెనకడుగు వేస్తుంటారు. అయితే ఐఫోన్‌ వినియోగించాలనే కోరిక ఉండి, బెస్ట్‌ ప్రైస్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌. ఇప్పుడు ఐఫోన్‌ 13 భారీ డిస్కౌంట్‌ ప్రైస్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఆలస్యం చేయకుండా ఆఫర్‌ డీటైల్స్‌ చూసేయండి మరి.

- Advertisement -

ఈ డివైజ్‌ ఫ్లాగ్‌షిప్ యాపిల్‌ ఐఫోన్‌ 14(iPhone 14)తో దాదాపు సమానమైన స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. బడ్జెట్‌లో ప్రీమియం ఫ్లాగ్‌షిప్-లెవల్‌ డివైజ్‌ కోరుకునే వారికి, యాపిల్‌ ఐఫోన్‌ 13 నిస్సందేహంగా అద్భుతమైన ఆప్షన్‌. ఐఫోన్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ 2021లో ఐఫోన్‌ 13 ప్రో, మినీ మోడల్స్‌తోపాటు రూ.79,900 ప్రారంభ ధరతో లాంచ్‌ అయింది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 13 భారీ డిస్కౌంట్‌ ప్రైస్‌ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను ఇప్పుడు రూ.36,099 ఆఫర్‌తో రూ.25,900 వద్ద అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్‌లు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు. దీని ద్వారా ఐఫోన్‌ 13 ధర రూ.58,900కి తగ్గుతుంది. అంతే కాకుండా కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లపై రూ.33,000 వరకు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ను పొందవచ్చు. అందుబాటులో ఉన్న అన్ని ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను వినియోగించుకుంటే, ఇప్పుడు iPhone 13ని ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ.25,900కి కొనుగోలు చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement