Wednesday, May 1, 2024

సుందర జల దృశ్యాలు : తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జలకళ… గేట్లు ఎత్తివేత‌…

శ్రీశైలం ప్రాజెక్టు

కృష్ణా ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. శ్రీశైలానికి 2,56,076 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో ఆరు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.90 అడుగుల నీరున్నది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది.

జూరాల ప్రాజెక్టు
ఎగువనున్న జూరాల ప్రాజెక్టుకు 22.21లక్షల క్యూసెక్కుల ఉండగా.. అధికారులు 45 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అవుట్‌ ఫ్లో 2,21,266 క్యూసెక్కులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.750 టీఎంసీలు నిల్వ ఉన్నది.

సాగర్‌ పదిగేట్ల ఎత్తివేత..
నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది. దీంతో డ్యామ్‌ పది గేట్లను ఎత్తి 1.49లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సాగర్‌లో ప్రస్తుతం నీటిమట్టం 589.90 అడుగులు ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 310.55 టీఎంసీల నీరున్నది. జలాశయానికి 1.95లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. అదేస్థాయిలో అవుట్‌ ఫ్లో ఉన్నది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 22 గేట్లు ఎత్తివేత
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. అధికారులు 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,12,780 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,23,480 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 1091 అడుగులుగా ఉంది.

- Advertisement -

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎ 25 గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 25 గేట్లు ఎత్తి 2 లక్షల 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‎ఫ్లో 2 లక్షల 34 వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 19.050 టీఎంసీలుగా ఉంది.

తాలిపేరు ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ముందస్తుగానే అధికారులు తాలిపేరు ప్రాజెక్ట్ 9 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి 18,365 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేశారు.

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం : 1633 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం :1633 అడుగులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 21,196 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 21,524 క్యూ సెక్కులుగా ఉంది. తుంగభద్ర పూర్తి స్థాయి నీటినిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement