Sunday, April 28, 2024

Kerala: క‌రోనా కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి… కేంద్ర ఆరోగ్య శాఖ సూచ‌న

క‌రోనా వైర‌స్ కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది. కేరళలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ కేసుల ఆకస్మిక పెరుగుదలపై కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం సమావేశాన్ని నిర్వహించింది.

కేరళలో 292 కొత్త కొవిడ్ -19 యాక్టివ్ కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసుల పెరుగుదల, ఆసుపత్రుల్లో వైద్య సేవల సంసిద్ధతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ… ‘దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలి. అన్ని ఆసుపత్రుల్లో ప్రతి 3 నెలలకోసారి మాక్‌డ్రిల్స్‌ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి. కరోనా పరిస్థితిలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. రాష్ట్రాలకు కేంద్రం అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది. హెల్త్ ను రాజకీయ అంశంగా చూడొద్దు’ అని అన్నారు.ఈ సమావేశంలో కేంద్రమంత్రులు ఎస్పీ సింగ్ బాఘేల్, భారతి ప్రవీణ్ పవార్, ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్, ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బహ్ల్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement