Wednesday, May 1, 2024

సినిమాకోసం గ‌ద్ద‌ర్ పాట‌- నెట్టింట వైర‌ల్

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పాడిన పాట నెట్టింట దుమ్ము రేపుతోంది.. బానిస‌లారా లెండిరా అనే పాట వైర‌ల్ గా మారింది. ఈ పాటను గద్దర్ స్వయంగా రాయడమే కాక… హృదయాలను తాకేలా పాడారు. ఈ పాటకు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ పాటకు సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీని అందించారు. బొమ్మాకు మురళి నిర్మిస్తున్న సినిమా కోసం గద్దర్ ఈ పాటను పాడారు. ఈ సినిమాలో సీనియర్ నటి సితార, రాజకీయ నేత అద్దంకి దయాకర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి ఈ సినిమాను నిర్మించారు.

https://www.youtube.com/watch?v=fYCpmh8-8M8
Advertisement

తాజా వార్తలు

Advertisement