Friday, December 6, 2024

Banglore – చంద్రబాబుతో కర్ణాటక డిప్యూటీ సి ఎం డి కె శివ కుమార్ భేటీ

కుప్పం, డిసెంబర్ 28(ప్రభ న్యూస్ ): తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తో కర్ణాటక డిప్యుటీ సీఎం డి. కె. శివ కుమార్ బెంగళూరు విమానాశ్రయంలో రహస్యం గా భేటీ కావడం తీవ్ర సంచలనంగా మారింది. తెలంగాణ ఎన్నికలల్లో కీలకం గా వ్యవహారించి గెలుపు దిశగా తీసుకుపోవడంలో డి. కె శివ కుమార్ కీలకం గా పనిచేశారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం లో మూడు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుండి బెంగళూరు విమానాశ్రయం కు గురువారం మధ్యాహ్నం చేరుకోవడం జరిగింది.

ప్రత్యేక విమానం రన్ వే కు రాగానే కర్ణాటక డిప్యూటీ సీఎం డి కె శివ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు రహస్యం గా ముందుకు వెళ్లి మాట్లాడుకోవడం జరిగింది. దీనిపై పలు కధనలు వినిపిస్తున్నాయి.. తెదేపా, కాంగ్రెస్ ముఖ్య నేతలు బహటంగా మాట్లాడుకోవడం రాబోయే ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్ సంచలనం గా మారనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement