Thursday, April 18, 2024

ఆర్‌ఆర్‌ఆర్‌ కు ఆస్కార్‌పై బండి హర్షం.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గతంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు ద క్కిన నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు రాజమౌళిని ప్రశంసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ట్వీట్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు బండి సంజయ్‌ తీరును తప్పుబడుతున్నారు. గతంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డైరెక్టర్‌రాజమౌళిని ఉద్దేశించి… బిడ్డ నువ్వు కనక సినిమా రిలీజ్‌ చేస్తే ఉరికిచ్చి కొడతాం, అని బండి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సామాజిక మాద్యమాల్లో మండిపడుతున్నారు.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి బండి సంజయ్‌ అంటూ నెటిజన్స్‌ మండిపడుతున్నారు. నాడు బండి సంజయ్‌ చేసిన ట్వీట్‌ను ప్రస్తుతం నెటిజన్లు రీ ట్వీట్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని బండికి హితవు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement