Thursday, April 25, 2024

MASS FEAST | బాలయ్య బర్త్ డే స్పెషల్.. ‘భగవంత్ కేసరి’ గ్లింప్స్ రిలీజ్

నటసింహం సందమూరి బాలకృష్ణ నటిస్తోన్న 108వ సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండ‌గా.. ఇవ్వాల ఈ మూవీ టైటిల్ రివీల్ చేశారు మేక‌ర్స్. అయితే ఈ సారి తెలంగాణ యాసలో బాక్సాఫీస్‌ని బ‌ద్ద‌లుకొట్ట‌నున్నాడు బాలయ్య. అంతేకాదు బాలయ్య బర్త్‌ డే సందర్భంగా సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం మ‌రో స‌ర్ప్రైజ్ ని ప్లాన్ చేశారు మేకర్స్. బాలయ్య బ‌ర్త డే రోజున‌ దిమ్మతిగేలాంటి వీడియో గ్లింప్స్ రిలీజ్ చేయ‌నున్నారు.

బాలయ్య బర్త్ డే సందర్భంగా భగవంత్ కేసరి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో అనిల్ రావిపూడి ఇప్పటి వరకు తన సినిమాల్లో కామెడీ తోపాటు.. యాక్షన్ ను కూడా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. కానీ ఈసారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాతో రానున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా కనిపించనుండగా.. మరో హీరోయిన్ గా శ్రీలీల నటించనుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement