Tuesday, July 23, 2024

Ayodya : నేటి నుంచి అయోధ్య బాల రాముని దర్శనం..

ఇవాళ్టి నుంచి అయోధ్యలోని బాలరాముని దర్శనం కలగనుంది. 24 అడుగుల దూరం నుంచి సాధారణభక్తులు బాలరాముని దర్శనం చేసుకోనే అవకాశం. సమయాలను రెండు స్లాట్లుగా విభజన చేశారు.

ఉదయం 7గంటల నుంచి ఉదయం 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు భక్తులు బాలరాముని దర్శనం చేసుకోవచ్చు. ప్రతిరోజూ మూడు హారతులు ఉంటాయి. ఉదయం 6.30 గంటలకు శృంగారం హారతి, మధ్యాహ్నం 12గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement