Sunday, April 28, 2024

Ram Mandir: భ‌క్తుల‌తో ఆయోథ్య కిట‌కిట … ద‌ర్శ‌న స‌మ‌యం పొడ‌గింపు

అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు కొలువైన అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకునేందుకు అర్థరాత్రి నుండే గజగజ వణికిస్తున్న చలిలో సైతం క్యూలలలో వేచివుంటున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. అధిక సంఖ్యలో భక్తులు రామ్‌లల్లాను చూసేందుకు, పూజలు చేసేందుకు అవకాశాన్ని కల్పించాలని ట్రస్ట్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. ఇక‌పై తెల్ల‌వారుఝాము 4.30 గంట‌ల‌కే రామ్ ల‌ల్లా ద‌ర్శ‌న భాగం క‌లుగ‌నుంది.. రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు బాల‌రాముడిని భ‌క్తులు వీక్షించ‌వ‌చ్చు. రామ భక్తులకు ఇకపై దర్శనానికి మరో గంట సమయం అదనంగా ఈ మార్పు వ‌ల్ల ల‌భిస్తున్న‌ది.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రామ్‌లల్లా హారతి, దర్శనం కోసం విడుదల చేసిన షెడ్యూల్‌ వివరాలు..
మంగళ హారతి: ఉదయం 4.30 గంటలకు
ఉత్థాన్ హారతి : ఉదయం 6.30 గంటలకు
దర్శనం: ఉదయం 7 గంటల నుంచి
భోగ్ హారతి: మధ్యాహ్నం 12 గంటలకు
సాయంత్రం హారతి: 7.30 గంటలకు
రాత్రి భోగ్ హారతి: 9 గంటలకు
శయన హారతి: రాత్రి 10 గంటలకు

Advertisement

తాజా వార్తలు

Advertisement