Friday, April 26, 2024

ఐపిఎల్‌ వేలంలో ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ పేరు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు చాలామంది ఉత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఇటీవలె ఆస్ట్రేలియన్‌ ఆల్‌ రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ కూడా తనకు ఐపిఎల్‌లో ఆడాలని ఉందని అన్నాడు. అంతే కాదు ఇప్పటికే వేలంలో గ్రీన్‌ తన పేరును రిజిస్టర్‌ చేసుకున్నాడు.

” ఐపిఎల్‌ వేలంలో పేరు రిజిస్టర్‌ చేసుకున్నా. ఐపిఎల్‌ అనేది నేను ఎక్కువగా ఆడని లీగ్‌. టాలెంట్‌ ఉన్న కోచ్‌లు, ఆటగాళ్లను చాలామందిని కలవొచ్చు. ఐపిఎల్‌ వాతావరణంలో చాలా కొత్త విషయాలు నేర్చుకునేందుకు నేను సిద్దంగా ఉన్నాను” అని గ్రీన్‌ తన మనసులో మాట చెప్పాడు.

బిగ్‌ బాష్‌ సీజన్‌ 13లో ఆల్‌ రౌండర్‌గా అదరగొట్టిన గ్రీన్‌ రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యాడు. టెస్ట్‌, టీ 20ల్లో అరగ్రేటం చేశాడు. టీ 20 వరల్డ్‌ కప్‌ ముందు భారత్‌లో జరిగిన టీ 20ల సిరీస్‌లో కామెరూన్‌ గ్రీన్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌లలో 241.55 స్ట్రైక్‌ రేట్‌తో 118 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో ఈ ఆల్‌ రౌండర్‌ను వేలంలో దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. డిసెంబర్‌ 23వ తేదీన కొచ్చిలో ఐపిఎల్‌ 2023 వేలం మొదలుకానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement