Thursday, May 2, 2024

Australia vs South Africa – డీకాక్ మ‌రో శ‌త‌కం …సౌతాఫ్రికా 197/3

ల‌క్నో – వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సఫారీలో మూడు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెన‌ర్‌ డీకాక్ సెంచ‌రీ చేశాడు. 91 బంతుల‌లో 8 ఫోర్లు, అయిదు సిక్స‌ర్ల‌తో శ‌త‌కం నమోదు చేసుకున్నాడు..ఈ వ‌రల్డ్ క‌ప్ లో డికాక్ కి ఇది రెండో సెంచురీ.. ప్ర‌స్తుతం 109 ప‌రుగులు చేసి మూడో వికెట్గా వెనుతిరిగాడు…. కాగా లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో జ‌రుతున్న ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. బ్యాటింగ్ దిగిన ద‌క్షిణాఫ్రికా తొలివికెట్ కు డికాక్,. బ‌వుమా లు 108 ప‌రుగులు జోడించారు.. బ‌వుమా 35 ర‌న్స్ చేసి మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అనంత‌రం బ‌రిలోకి వ‌చ్చిన డుస్సెన్ 26 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ కు చేరాడు. ప్ర‌స్తుతం క్లాసన్ , మ‌క్ర‌మ్ 18 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.. 35 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి స‌ఫారీలు రెండు వికెట్లు కోల్పొయి 197 ప‌రుగులు చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement