Thursday, April 25, 2024

ఫిఫా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా బోణి.. 1-0తో ట్యునీషియాపై గెలుపు

ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ట్యునీషియాను 1-0తో ఓడించింది. మ్యాచ్‌ 23వ నిమిషంలో ఆసీస్‌ స్ట్రైకర్‌ మిచెల్‌ డ్యూక్‌ గోల్‌ అందించాడు. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా రెండు జట్లు ఒక్క గోల్‌ చేయలేకపోయాయి. దీంతో ఆసిస్‌ జట్టు విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు రౌండ్‌ ఆఫ్‌ 16 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కాగా డెన్మార్క్‌తో ఆడిన తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ట్యూనీషియా ఈ మ్యాచ్‌లో ఓటమి పాలై ఫ్రీ క్వార్టర్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement