Thursday, May 2, 2024

ఫ్రాన్స్ తగుల‌బ‌డుతుంటే మ్యూజిక్ క‌చేరిలో ఫ్రాన్స్ ప్ర‌ధాని …

పారిస్ – ఫ్రాన్స్ లో నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీస్‌ కాల్పుల్లో నాహెల్‌ అనే 17 ఏండ్ల యువకుడి మృతితో దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా యువత పెద్దఎత్తున ఆందోళనలో పాల్గొని విధ్వంసం సృష్టిస్తున్నారు. దీంతో ఫ్రాన్స్ లోని అనేక ప్రాంతాల‌లో క‌ర్ఫ్యూ విధించారు..శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు సైన్యాన్ని రంగంలోకి దించారు.. అయినా ఇప్ప‌టికీ సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డం లేదు .. ఈ ఉద్రిక్త‌త‌ల స‌మ‌యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఓ మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొనడం తీవ్ర వివాదానికి దారితీసింది..

ఇటీవలే పారిస్ లో జరిగిన బ్రిటిష్ సింగర్ ఎల్టాన్ జాన్ కన్సర్ట్ కు మెక్రాన్ సతీమణితో కలిసి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మెక్రాన్ పై మండిపడుతున్నారు. ఆందోళన కారులు ఫ్రాన్స్ నగరాల్లో విధ్వంసం సృష్టిస్తుంటే అధ్యక్షుడు మాత్రం సతీమణితో కలిసి మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్ర‌ధాని ఎటువంటి విచారం వ్య‌క్తం చేయ‌క‌పోవడంతో సోష‌ల్ మీడియాలో ప్రాన్స్ ప్ర‌ధానిపై విమ‌ర్శలు వెల్ల‌వెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement