Saturday, July 27, 2024

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. ప్రవాసి సహాయతా కేంద్రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విదేశాలకు ముఖ్యంగా కువైట్‌, ఖతార్‌లకు వెళ్ళే వలస కార్మికుల కోసం 24 గంటలు పని చేసే ప్రవాసి సహాయతా కేంద్రం బుధవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. జీఎమ్మార్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌, తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపనీ లిమిటెడ్‌ (టమ్‌కమ్‌) భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ సెటంర్‌ను స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాణి కుముదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయ సీఈవో ప్రదీప్‌ పణికర్‌ ఇతర సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.
ఈ కేంద్రం సురక్షితమైన, చట్టపరమైన ప్రవాసం గురించి అవగాహన పెంచడానికి గృహ కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు వంటి వారికి శరైన పత్రాలు, ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ కోసం అవసరమైన పత్రాల విషయంలో సహాయపడనుంది. అంతర్జాతీయ డిపార్చర్‌ టెర్మినల్‌ వద్ద అందుబాటులో ఉండే ఈ సహాయతా కేంద్రం 24 గంటలు పని చేయనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement