Friday, May 3, 2024

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ప్రీ-క్వార్టర్స్‌కు ఆశిష్‌..

తాష్కెంట్‌ (ఉజ్బెకిస్థాన్‌) : టోక్యో ఒలింపియన్‌ ఆశిష్‌ చౌదరి మంగళవారం ఇక్కడ అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాడు. పురుషుల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 2023లో 80 కిలోల ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. 2021 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజత పతక విజేత ఇరాన్‌కు చెందిన మేసం ఘెష్లాగిపై 4-1 తేడాతో ఆశిష్‌ చౌదరి విజయం సాధించాడు. హెమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల డైనమిక్‌ పగ్లిస్ట్‌ మొదటి రౌండ్‌లో తన ప్రత్యర్థిని శక్తివంతమైన బౌట్‌లతో హడలెత్తించాడు. అత్యున్నత సాంకేతిక సామర్థ్యాన్ని ఉపయోగించుకుని తదుపరి రౌండ్‌లలో ఇరానియన్‌ పగ్లిస్ట్‌ను అధిగమించి విజయాన్ని సాధించాడు.

రౌండ్‌ ఆఫ్‌ 16లో క్యూబాకు చెందిన రెండుసార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌ అర్లెన్‌ లోపెజ్‌ నుండి చౌదరికి ఇప్పుడు కఠినమైన సవాలు ఎదురవనుంది. ఇదిలా ఉండగా, 86 కేజీల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన బిల్లి మెక్‌ అలిస్టర్‌పై 0-5 తేడాతో ఓడిపోయిన హర్ష్‌ చౌదరి పోటీ నుంచి నిష్క్రమించాడు. బుధవారం, నిశాంత్‌ దేవ్‌ (71 కిలోలు) 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత అజర్‌బైజాన్‌కు చెందిన సరాన్‌ అల్లియేవ్‌తో తలపడనున్నాడు, ఈ టోర్నమెంట్‌లో 107 దేశాల నుండి అనేక మంది ఒలింపిక్‌ పతకాలతో సహా 538 మంది బాక్సర్లు పాల్గొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement