Monday, May 6, 2024

మిస్‌ ఇండియాగా ఎంపికైన ఆర్యా వాల్వేకర్‌..

భారత సంతతికి చెందిన 18 ఏళ్ల ఆర్యా వాల్వేకర్‌ మిస్‌ ఇండియా 2022గా ఎంపికైంది. అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా జరిగిన వార్షిక పోటీల్లో అమెరికాలోని న్యూజెర్సీలో నివాసముంటున్న ఆర్యా ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్ననాటి నుంచి తనకు నటన అంటే ఇష్టమని పేర్కొంది. వ్యక్తిత్వ వికాసంపై వివిధ ప్రదేశాల్లో అవగాహన సదస్సుల్లో ప్రసంగించి.. పలువురిని చైతన్యవంతులను చేసింది.

అంతేగాకుండా వర్జినీయాలో చిన్నారులకు నృత్యం నేర్పించడం, పిల్లలకు నాటకాలు చేయించి వారితో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. పిల్లలతో ఆడుకోవడం, వంట చేయడం వంటివి ఇష్టమని తమ హాబీలుగా చెప్పుకొచ్చింది. యోగా చేయడం, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం ఇష్టమని చెప్పింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement