Thursday, May 2, 2024

జాబిల్లి యాత్రకు ఆర్టెమిస్‌ రెడీ.. డిటెయిల్స్ వెల్ల‌డించిన‌ నాసా

చంద్రుడిపైకి ఆర్టెమిస్‌-1ను ప్రయోగించేందుకు నాసా సిద్ధమైంది. రేపు (బుధవారం) ఉదయం 11.34 గంటలకు నింగిలోకి బయల్దేరనున్నది. ఈ మేరకు మిషన్‌ నిర్వాహకులు ఆర్టెమిస్‌ ప్రయోగానికి సంబంధించి సమీక్ష జరిపి లాంచింగ్‌పై నిర్ణయం తీసుకున్నారు. ఉష్ణమండల తుఫాను నికోల్‌ ఫ్లోరిడాపై ప్రభావం చూపిన కొన్ని రోజులకే ఈ మిషన్‌కు నాసా పచ్చా జెండా ఊపడం విశేషం. చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు ఉద్దేశించిన ఈ మిషన్‌ ఇప్పటివరకు రెండుసార్లు వాయిదా పడింది. ఆర్టెమిస్‌-1 ప్రయోగం సాంకేతికమైనది.

ఈ స్పేస్‌ క్యాప్సూల్‌లో మనుషులను నాసా పంపడం లేదు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే.. 2024 లో ఆర్టెమిస్‌-2 ప్రయోగాన్ని చేపట్టి వ్యోమగాములను చంద్రుడిపైకి తీసుకెళ్లాలని నాసా భావిస్తున్నది. చంద్రుడిపై శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేయడంలో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నది. అయితే, ప్రస్తుతం ఈ మిషన్‌లోని ఓరియన్‌ క్యాప్సూల్‌ మానవ రహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిరానున్నది. 2025లో ఆర్టెమిస్‌-3ని ప్రయోగించేందుకు నాసా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. సెప్టెంబర్‌ 3 వ తేదీన ప్రయోగానికి అంతా సిద్ధం చేసిన తర్వాత లాంఛ్‌ సిస్టమ్‌ రాకెట్‌లో ఇంధనం లీక్‌ అవుతున్నట్లు గుర్తించారు. సూపర్‌ కోల్డ్‌ హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ లీక్‌ అవుతుండటంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. తొలుత ఈ ప్రయోగాన్ని ఆగస్టు 29 న వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement