Monday, April 29, 2024

ఏ ఊరి దుకాణానికైనా హైదరాబాద్‌లో దరఖాస్తు.. సిండికేట్ల నివారణకు చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మద్యం దుకాణాల కేటాయింపుల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ దఫా అనేక విప్లవాత్మక సంస్కరణలను దరఖాస్తుల సమయంలోనే తీసుకుంటోంది. రాష్ట్రంలోని ఏ మారుమూల, ఏ పట్టణం, నగరంలోనైనా ఎవరికీ తెలియకుండా, ఎవరికి భయపడకుండా దైర్యంగా దరఖాస్తులు దాఖలు చేసేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని ఏ దుకాణానికైనా ఎవరికీ తెలియకుండా కమిషనర్‌ కార్యాలయంలో కూడా దరఖాస్తులు సమర్పించి వెళ్లేలా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసింది, అన్ని జిల్లాల కలెక్టరేట్లతోపాటు, హైదరాబాద్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఇందుకు ప్రత్యేక కౌంటర్‌ను తాజాగా ఆబ్కారీ శాఖ ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణలో సిండికేట్లుగా ఏర్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. సిండికేట్లకు వీలు లేకుండా మద్యం దుకాణాలకు ధరఖాస్తులను అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మద్యం దుకాణానికైనా దరఖాస్తులు స్వీకరించేందుకు హైదరాబాద్‌లోని ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ కేంద్రాన్ని ప్రజలు విరివిగా ఉపయోగించుకునేలా చూడాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అబ్కారీ శాఖ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రొహిబిషన్‌, ఎ-కై-్సజ్‌ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా జరగాలని, అందరికీ అవకాశాలు కల్పించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణ లో ఎవరైనా సిండికేట్‌గా ఏర్పడిన, ఎవరైనా దరఖాస్తులు సమర్పించకుండా అడ్డంకులు సృష్టించినా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారికి, సహకరించే వారిపై గట్టి నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపుతున్నామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడైతే తక్కువ దరఖాస్తులు వస్తున్నాయో పరిశీలించాలని అదేశించారు. గౌడ్‌, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన మద్యం దుకాణాల దరఖాస్తుకు కుల ధ్రువీకరణ పత్రం, ఏజెన్సీ సర్టిఫికెట్‌ లేకపోతే సెల్ఫ్‌ అఫిడవిట్‌లను అంగీకరించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అధికారులను ఆదేశించారు. మద్యం దుకాణాల దరఖాస్తు చేయడంలో ఎటు-వంటి సమస్యలు ఉన్నా, దరఖాస్తుదారులకు సమాచారం కావాలన్నా వెంటనే స్థానిక ఎ-కై-్సజ్‌ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.

వీలైతే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 425 2523 ను సంప్రదించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సూచించారు. జిల్లాలోని ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఆ జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌, సిమెంట్‌ ,ఫార్మా వస్త్ర, తదితర వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీని వివరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫరూఖీ, జాయింట్‌ కమిషనర్‌ అజయ్‌రావు, ఎస్‌ఈలు, అసిస్టెంట్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement