Thursday, May 2, 2024

USB-C పోర్ట్ తో.. ఆపిల్ బీట్స్ స్టూడియో ప్రో వైర్‌లెస్

ఆపిల్ త‌న బ్రాండ్ నుంచి మరో కొత్త బీట్స్ స్టూడియో ప్రో వైర్‌లెస్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లను మార్కెట్ లో రిలీజ్ చేయ‌నుంది. ఈ ఆపిల్ హెడ్‌ఫోన్‌ను జూలై 19న రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ హెడ్‌ఫోన్‌లో USB-C పోర్ట్ ఉంటుంది. గత వారం Apple సంబంధిత పోడ్‌కాస్ట్ ‘కనెక్ట్’లో మైక్ హర్లీ ఈ సమాచారాన్ని పంచుకున్నారు.

ఈ స్టూడియో ప్రో బ్లాక్ నేవీ, సాండ్‌స్టోన్, డీప్ బ్రౌన్ నాలుగు రంగులలో అందుబాటులో రానున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే, లీక్ అయిన కొన్ని ఫోటోల‌ ప్రకారం, ఈ స్టూడియో ప్రో బ్లాక్ హెడ్‌ఫోన్‌ బీట్స్ స్టూడియో3కి సిమిల‌ర్ డిజైన్‌ను కలిగి ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ స్టూడియో ప్రో బ్లాక్ హెడ్‌ఫోన్‌లో మైక్రో-USBకి బదులుగా ఛార్జింగ్ కోసం USB-C పోర్ట్‌ను కలిగి ఉంది. హెడ్‌ఫోన్‌లు మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అప్‌గ్రేడ్ చేసిన మైక్రోఫోన్‌లు, ఆప్టిమైజ్డ్ సౌండ్ ప్రొఫైల్‌లు, కొత్త క్యారీయింగ్ కేస్, ఫాస్ట్ పెయిర్, ఫైండ్ మై డివైస్ వంటి Android ఫీచర్‌లకు సపోర్ట్ చేయ‌నుంది. అంతే కాకుండా.. 3.5 mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement