Friday, May 17, 2024

AP | ఎంహెచ్‌ఆర్‌డి స్కాలర్‌షిప్‌ దరఖాస్తులకు ఆహ్వానం

అమరావతి, ఆంధ్రప్రభ: కళాశాలల్లో, యూనివర్శిటీలలో చదివే విద్యార్ధులకు ఉన్నత విద్యాశాఖకు చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ (ఎమ్‌హెచ్‌ఆర్‌డి) అందించనున్న స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు ఐటి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ కింద ఎమ్‌హెచ్‌ఆర్‌డి నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు డిశంబరు 31 లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement