Wednesday, December 7, 2022

పవన్ వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పవన్ గురించి మాట్లాడితే తన వ్యక్తిత్వానికే దెబ్బ అని ఆరోపించారు. పవన్ వల్ల మహిళలు ఎంతోమంది బాధపడుతున్నారని ఆరోపించారు. వైసీపీని విమ‌ర్శించే అర్హ‌త ప‌వ‌న్‌కు లేద‌ని చెప్పారు. జ‌గ‌న్‌ను చూస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అసూయ అని ఆయ‌న ఆరోపించారు.

2019 ఎన్నికలకు ముందే వైసీపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేరాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రిపారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యలు చేశారు. అయితే అందుకు జ‌గ‌న్ ఒప్పుకోలేద‌ని నారాయణ స్వామి చెప్పుకొచ్చారు. త‌న‌కు అవ‌స‌రం లేద‌ని, ప్ర‌జ‌లు ఓట్లు వేస్తే తాను సీఎం అవుతాన‌ని జ‌గ‌న్ అన్నార‌ని నారాయణ స్వామి తెలిపారు. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్నాన‌ని చెప్పిన సింహం జ‌గ‌న్ అని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ ఏపీలోని గ్రామాల్లో ప‌ర్య‌టించ‌వ‌చ్చ‌ని, ఆయ‌న‌పై దాడి చేయాల్సిన అవ‌సరం త‌మ‌కు లేద‌న్నారు. ఏపీలో జ‌గ‌న్ ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేశార‌ని, ఆ అక్కసుతోనే ప‌వ‌న్ మాట్లాడుతున్నార‌ని నారాయణస్వామి చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement