Sunday, April 28, 2024

ఏపీ కేబినెట్‌..నిర్ణయాలివే..

ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టాలని మంత్రులకు ఆదేశించారు సీఎం.. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు కూడా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇక, పెన్షన్ల కోత విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్న ఏపీ సీఎం.. అర్హులకు మేలు జరిగేలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలని ఆదేశించారు.. ధనికులను కూడా పెన్షన్ లబ్ధిదారుల జాబితాలో చేర్చిన గత టీడీపీ ప్రభుత్వానిదని.. అర్హులకు అన్యాయం చేసిందని అభిప్రాయపడ్డారు పలువురు మంత్రులు. ఇక, విద్యుత్ భారం కూడా గత ప్రభుత్వానిదే అంటున్నారు.. ప్రభుత్వం చేస్తున్న లబ్ధిని.. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేలా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని మంత్రులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.

ఇది కూడా చదవండి: గుంటూరులో ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కు డ్యాన్స్ వేసిన కార్మికులు

Advertisement

తాజా వార్తలు

Advertisement