Tuesday, April 30, 2024

బ‌యోపిక్ తో రీ ఏంట్రీ ఇవ్వ బోతున్న అనుష్క‌..

బాలీవుడ్ బయోపిక్ ల సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ క్రీడా నేపథ్యం తో ముడిపడిన ప్రముఖుల బయోపిక్ లకు సక్సెస్ రేటు గురించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మరో బయోపిక్ కి రంగం సిద్దమైంది. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ‘జులన్ నిషిత్ గోస్వామి’పై సినిమా తెరకెక్కనుంది. ఇందులో అనుష్క శర్మ నిషిత్ గోస్వామి పాత్రలో నటిస్తుంది. చక్ ద ఎక్స్ ప్రెస్ టైటిల్ తో అనుష్క ప్రొడక్షన్ హౌజ్ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు డైరెక్టర్ ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అనుష్క శర్మ మూడేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వ బోతుంది.

పెళ్లైన తర్వాత అనుష్క ధాంపత్య జీవితానికి ఎక్కువ సమయం కేటాయించింది. అలా అనుష్క మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వ‌చ్చింది. తాజాగా మళ్లీ బయోపిక్ తో రెడీ అవుతుంది ఈ బ్యూటీ. సినిమాకి సంబంధించిన ఓ వీడియోను కూడా అనుష్క ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి అభిషేక్ బెనర్జీ కథ.. స్ర్కీన్ ప్లే అందిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు చిత్రబృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ చేస్తార‌ట‌.

https://twitter.com/AnushkaSharma/status/1478940165418610688

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement