Monday, April 29, 2024

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్ టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌..!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) శుభవార్త చెప్పింది. మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ విభాగాల్లో 833 ఇంజనీరింగ్‌, ఇతర ఉద్యోగాల భర్తీకి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్‌ ఇంజనీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

ఈనెల 29 నుంచి అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. మున్పిపల్‌ శాఖలో 175 టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పోస్టులకు, మహిళా, శిశుసంక్షేమ శాఖలో 23 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిందే. తాజా నోటిఫికేషన్‌ పూర్తి వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement