Sunday, May 5, 2024

టెన్నిస్‌లో మ‌రో చ‌రిత్ర‌.. అత్య‌ధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన జొకోవిచ్‌

టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. అత్య‌ధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన తొలి ఆట‌గాడిగా రికార్డు సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను మూడోసారి కైవ‌సం చేసుకున్నాడు. ఇవ్వాల (ఆదివారం) జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నొవాక్ జొకోవిచ్ 7-6 (7/1), 6-3, 7-5తో నార్వే ప్లేయర్ క్యాస్పర్ రూడ్ పై ఘనవిజయం సాధించాడు.

3 గంటల 13 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో నొవాక్‌ జొకోవిచ్ వరుస సెట్లలో క్యాస్పర్ రూడ్ పై గెలుపొందాడు. తద్వారా పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ ముందు వరకు కూడా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన పురుషుల జాబితాలో స్పెయిన్ బుల్ రాఫెల్ నడాల్ తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. అయితే ఫ్రెంచ్ ఓపెన్ 2023ని నెగ్గడం ద్వారా 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో జొకోవిచ్ కొత్త చరిత్ర లిఖించాడు. నడాల్ 22 టైటిల్స్ తో రెండో స్థానంలో.. ఫెడరర్ 20 టైటిల్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు.

- Advertisement -

జకోవిచ్ టైటిల్స్ లెక్క ఇదే..

ఆస్ట్రేలియా ఓపెన్ ను 10 సార్లు (2008, 2011, 2012,2013,2015,2016,2019,2020,2021,2023).. ఫ్రెంచ్ ఓపెన్ ను మూడు సార్లు (2016,2021).. వింబుల్డన్ ను ఏడు సార్లు (2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022).. యూఎస్ ఓపెన్ ను మూడు సార్లు (2011,2015,2018) సొంతం చేసుకున్నాడు. ఓవరాల్ గా 23 టైటిల్స్ తో పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా నిలిచాడు. ఓవరాల్ గా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్ గా సెరెనా విలియమ్సన్ తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో అత్యధిక టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement