Friday, March 1, 2024

Breaking | 8 మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణలో పనిచేస్తున్న 8 మంది డిఎస్పి లను బదిలీ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజని కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో గత పది రోజులుగా పెద్ద ఎత్తున బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకే జిల్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన డిఎస్పీలను, స్వంత జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement