Friday, May 17, 2024

రైస్ ఎక్స్‌పోర్ట్‌లో ఆంధ్రా టాప్‌..

దేశంలోనే వరి పంటలో ఆంధ్ర అన్నపూర్ణ గా రాష్ట్రానికి పేరుంది. అదేవిధంగా ఇతర దేశాలకు బియ్యం ఎగుమతుల్లో కూడా ఆంద్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉంది. బియ్యం ఎగుమతులకు అవకాశాలు మెండుగా ఉండడంతో ఈ అవకాశాన్ని ఏపీ అందిపుచ్చుకుంది. దీంతో బియ్యం ఎగుమతుల్లో రాష్ట్రం దూసుకుపోతోంది. ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా దేశాలకు రాష్ట్ర బియ్యం ఎక్కువగా ఎగుమతి అవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ.5,790 కోట్ల విలువైన 22.09 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ నాటికి రూ.4,131.86 కోట్ల విలువైన 16.38 లక్షల టన్నులు ఎగుమతి చేసింది. 2019-20లో ఎగుమతి విలువ రూ.1,902.65 కోట్లుగా ఉంది. అయితే ఈ రెండేళ్లలోనే ఎగుమతులు రెండు రెట్లకు పైగా పెరిగాయి. ఈ ఏడాది రాష్ట్ర బియ్యం ఎగుమతులు 30 లక్షల టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

గతంలో కాకినాడ యాంకర్‌ పోర్టు, కృష్ణపట్నం పోర్టు ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతి జరిగేది. దీంతో బియ్యం తీసుకెళ్లడానికి వచ్చిన ఓడలు దీర్ఘకాలం సముద్రంలోనే నిరీక్షించాల్సి వచ్చేది. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అహార సంక్షౌభం తలెత్తింది. బియ్యానికి డిమాండ్‌ పెరిగింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిత్వ శాఖతో చర్చించి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు ద్వారా కూడా బియ్యం ఎగుమతికి అనుమతులు తీసుకొంది. ఇక్కడి నుంచి కూడా బియ్యం ఎగుమతులకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయి. గతంలో నెలకు 10 నుంచి 12 ఓడల ద్వారా ఎగుమతి చేయగా, ప్రస్తుతం 16 ఓడల వరకు ఎగుమతి చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement