Thursday, May 9, 2024

Delhi | 105 కోట్లతో అనంత సెంట్రల్‌ వర్సీటీ క్యాంపస్‌.. రాజ్యసభలో కేంద్ర మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మంజూరు చేసిన 25 పోస్టులకు (16 టీచింగ్, 9 నాన్-టీచింగ్) గాను 19 పోస్టులకు (13 టీచింగ్, 6 నాన్ టీచింగ్) అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ యూనివర్శిటీలో మంజూరైన పోస్టులను మిషన్ మోడ్‌లో భర్తీ చేయాలని కేంద్ర విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.  

సిబ్బందిని నియమించాల్సిన బాధ్యత  పార్లమెంట్ చట్టం ద్వారా అటానమస్ హోదా పొందిన ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ పైనే ఉందని మంత్రి స్పష్టం చేశారు. యూనివర్శిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయడం నిరంతర ప్రక్రియని మంత్రి అన్నారు. యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్రం రూ. 450 కోట్లు మంజూరు చేయగా అందులో శాశ్వత క్యాంపస్ భవనాల నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 105 కోట్లు  విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతపురంలోని జేఎన్టీయూ ప్రాంగణంలో తాత్కాలిక క్యాంపస్ నుండి సెంట్రల్ యూనివర్శిటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement