Friday, May 10, 2024

చేనేత క‌ళాకారుడి వినూత్న ఆలోచ‌న‌.. సుగంధ ద్ర‌వ్యాల‌తో పరిమళించే ప‌ట్టుచీర‌..

సిరిసిల్ల మ‌ర‌మ‌గ్గంపై ఎన్నో ర‌కాల చీర‌లు త‌యారు చేయ‌బ‌డి ఎంతో గుర్తింపు పొందాయి. ఎన్నో అవార్డుల‌ను సైతం సొంతం చేసుకున్నాయి. దీన్ని బ‌ట్టి చూస్తే అర్ధం చేసుకోవ‌చ్చు సిరిసిల్ల చీర‌ల‌కు ఎంత‌ ఆద‌ర‌ణ ఉంటుందో. తాజాగా మరమగ్గంపై పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారు చేసి మరోసారి ప్రతిభ చాటుకున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్‌. 27 రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి పరిమళాలు వెదజల్లే పట్టుచీరను మరమగ్గంపై నేసి.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. చేనేత కళాకారుడు నల్ల విజయ్ వినూత్న ఆలోచనతో తయారు పట్టు చీరను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆవిష్కరించారు. విజయ్ విజ్ఞప్తి మేరకు ఈ చీరకు సిరి చందన పట్టుగా మంత్రులు నామ‌క‌ర‌ణం చేశారు. ఈ సంద‌ర్భంగా యువ చేనేత కళాకారుడు విజయ్‌ను మంత్రులిద్ద‌రూ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement