Tuesday, May 7, 2024

Breaking: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో పేలుడు.. ఆరుగురు మృతి, 53 మందికి గాయాలు

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని ఇస్తిక్‌లాల్‌లో రద్దీగా ఉండే షాపింగ్‌ ఏరియాలో ఇవ్వాల (ఆదివారం) భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. ఘటనను అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ఖండించారు. ఉగ్రదాడిగా అనుమానిస్తున్నామని తెలిపారు. ఘటనలో భాగమైన నేరస్తులను గుర్తించేందుకు సంబంధిత విభాగాలు పని చేస్తున్నాయని ఎర్డోగాన్‌ పేర్కొన్నారు. ఈ పేలుడు తర్వాత బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ‘సంఘటనా స్థలానికి నేను 50-55 మీటర్ల దూరంలో ఉన్నాను. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. ముగ్గురు, నలుగురు వ్యక్తులు నేలపై పడిపోవడం చూశాను’ అని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.

పేలుడుతో ఒక్కసారిగా జనం భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. భారీ శబ్దం రావడంతో పాటు నల్లని పొగ పేరుకుపోయింది. అనంతరం భద్రతా బలగాలు మోహరించారు. పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ఇస్తిక్‌లాల్‌ షాపింగ్‌ స్ట్రీట్‌లో సాయంత్రం 4 గంటల సమయంలో పేలుడు చోటు చేసుకున్నది. ఇంతకు ముందు 2015-16లో జరిగిన దాడుల్లో ఇస్తిక్‌ లాల్‌ స్ట్రీట్‌ దెబ్బతిన్నది. ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ జరిపిన దాడుల్లో దాదాపు 500 మందికిపైగా మృతి చెందగా.. 2వేల మందికిపైగా గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement