Tuesday, April 30, 2024

America – కుప్ప కూలిన ఆర్మీ హెలికాప్టర్ – ఐదుగురు దుర్మరణం

అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌ మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని యుఎస్ మిలిటరీ ధ్రువీకరించింది. ఉదయం సముద్రంలో హెలికాప్టర్ కూలిపోయిందని యూఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ప్రాంతీయంగా విస్తరించకుండా ఉండేందుకు.. మధ్యధార ప్రాంతంలో ఒక ఆర్మీ బృందాన్ని అమెరికా మోహరించింది. సైనిక శిక్షణలో భాగంగా నవంబర్‌ 10న ఓ హెలికాప్టర్‌ గాల్లోకి ఎగిరింది. ఐదుగురు సర్వీస్ సభ్యులను తీసుకువెళుతున్న ఆ హెలికాప్టర్‌ సాంకేతిక సమస్య తలెత్తడంతో మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు సైనికులు మృతి చెందారు

ఐదుగురు సైనికుల మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement