Monday, April 29, 2024

Breaking | అదుపుతప్పి బోల్తాకొట్టిన అంబులెన్స్​, మంటలంటుకుని దగ్ధం

హైదరాబాద్​లో దారుణం జరిగింది. స్పీడ్​గా వెళ్లున్న ఓ అంబులెన్స్​ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆ వాహనానికి నిప్పు అంటుకుని అందరూ చూస్తుండగానే క్షణాల్లో కాలిపోయింది. అందులో ఉన్న డ్రైవర్​ కూడా అంబులెన్స్​తోపాటు సజీవంగా దహనమయ్యాడు. ఈ ఘటన ఇవ్వాల (మంగళవారం) ఉదయం హైదరాబాద్​లోని జీవన్​రెడ్డి నగర్​లో జరిగింది.

ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు చెందిన అంబులెన్స్​ స్పీడ్​గా వెళ్తుండగా అదుపుతప్పినట్టు తెలుస్తోంది. అయితే.. అంబులెన్స్​ కిందపడి దొర్లకుంటూ పోతున్న క్రమంలో ఆయిల్​ ట్యాంక్​ నేలకు రాసుకుని మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో క్షణాల్లోనే అంబులెన్స్​ దగ్ధమైనట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement